టీమ్ హెచ్ఓఏ: మీరిద్దరూ స్నేహితులా?
పిల్లలు: కాదు, ప్రాణ స్నేహితులం.
టీమ్ హెచ్ఓఏ: రెండిటికీ తేడా ఏంటి?
పిల్లలు: మిగతా వారు చెప్పుకోవడానికే స్నేహితులు. మేము ఆప్త మిత్రులం
టీమ్ హెచ్ఓఏ:మీరిద్దరూ ఒకరికొకరు ఎంత కాలం నుంచి తెలుసు?
పిల్లలు: చిన్నపటి నుంచి. మేము కజిన్స్ కూడా.
టీమ్ హెచ్ఓఏ: పెద్దయ్యాక మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు?
1 పిల్లాడు: ఆర్మీ ఆఫీసర్. అందుకే నేను ఆర్మీ కటింగ్ చేపించుకున్నాను.
2 పిల్లాడు: నేను కలెక్టర్ అవుతా. గ్రామాలలో మార్పు తీసుకొస్తా .
టీమ్ హెచ్ఓఏ: ఎలాంటి మార్పులని తీసుకొస్తావ్?
2 పిల్లాడు: ఇక్కడ రోడ్లు వేయిస్తాను. ఇక్కడ సరైన రోడ్లు లేవు. కాలకృత్యాలకి పొదలు కాకుండా బాత్ రూమ్ లు ఉపయోగించేలా చూస్తా.
టీమ్ హెచ్ఓఏ: అంటే ఇక్కడ బాత్ రూమ్ సదుపాయాలు లేవా?
పిల్లలు: ఉన్నాయి. పోయిన సంవత్సరం ఛాలా బాత్ రూమ్ లు కట్టారు. కానీ, జనం బయటికి వెళ్ళడానికే మొగ్గు చూపుతారు. నేను ఆ అలవాటు మారుస్తాను. టాయిలెట్ కి కాకుండా బయటికి వెళ్ళవారికి ఫైన్ విధిస్తా.
టీం హెచ్ఓఏ: స్కూల్ అయిపోయాక, ఖాళీ సమయంలో ఎం చేస్తారు?
పిల్లలు: ఈ ఆన్లైన్ క్లాసులు మొదలుకాకముందు హాస్టల్ లో చదువుకువేవాళ్ళం. ఇంట్లో సరిగా చదవట్లేదని మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని హాస్టల్ లో చేర్పించారు.
టీమ్ హెచ్ఓఏ: మరి చదువుకోకపోతే, మీరు కలెక్టర్ , ఆర్మీ ఆఫీసర్ ఎలా అవుతారు?
పిల్లలు: మేము చాలా స్మార్ట్(నవ్వుతూ).