“మాది కడపకి చెందిన ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచే, జీవితంలో ఏదైనా కొత్తగా చేయాలని కలలు కన్నాను. నాకు స్వతంత్రంగా ఉండడమంటే ఇష్టం. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, పెద్ద కొడుగ్గా తోబుట్టువులను చూసుకునే బాధ్యత నా మీద ఉంది. నేను ఇంటర్మీడియేట్ వరకూ చదువుకున్నాను. ఇంటి పరిస్థితుల వల్ల, మమల్ని చదివించలేకపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే, కష్టపడేది రైతులు. కానీ, లాభపడేది మాత్రం మధ్యలో ఉండే దళారులు. మమ్మల్ని పోషించడం కోసం, అమ్మా నాన్న బాగా కష్టపడ్డారు. మాకు ఆర్థిక తోడ్పాటు లేదు. ఆ పరిస్థితులు చూసి, ఇంటి బాధ్యత తీసుకోవాలని అనుకున్నాను. చాలా కష్టం మీద, క్యాబ్ రెంటల్ సర్వీస్ కంపెనీ లో డ్రైవర్ ఉద్యోగం లభించింది. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. నాకు ఎనిమిది వేలకంటే ఎక్కువ జీతం వచ్చేది కాదు. రెండు సంవత్సరాలు బాగా కష్టపడి, ఈఎంఐ లో సొంతంగా ఒక కారు కొన్నాను. అది నా జీవితాన్ని మార్చేసింది.
వ్యాపారం మెల్లిగా పుంజుకోవడం ప్రారంభమయ్యింది. కుటుంబ పోషణకి సరిపడా సంపాదించడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకున్న కల ఒకటే. పని, రాబడి గురించి ఆలోచించకుండా, కుటుంబంతో హాయిగా సమయం గడపగలిగే స్థాయికి చేరుకోవాలి. నేను జీవితంలో ఎన్నో సమస్యలని ఎదురుకున్నాను. ఈ ప్రక్రియలో నేను నేర్చుకున్నది ఏంటంటే, స్థిరంగా లక్ష్యం వైపు పయనించాలి, విజయం సాధించాలి.”