“ఒక విధంగా చెప్పాలంటే, నేను కూడా డాక్టర్నే. నేను ఎన్నో పాత కెమెరాలని, ఫోన్ లని పునరుద్ధరించాను. భారత దేశం లోని వివిధ ప్రదేశాలు తిరుగుతూ, ఈ ఆంటిక్ పీసులను సేకరించడమే నా ప్రపంచం. నేను ఎక్కువగా, పాత కెమెరాలు, రేడియోలు, టెలిఫోన్ లు సేకరిస్తుంటాను. నా దగ్గర ఒక పాత టెలీస్కోప్ కూడా ఉంది. నేను దాన్ని ముంబయి లోని పాత వస్తువులు సేకరించేవాడి దగ్గర కొన్నాను. ఇంతకు ముందు, పాత కెమెరాల చరిత్ర తెలుసుకోవడానికి రకరకాల షాపులకి తిరిగేవాడ్ని. ఇప్పుడు ఇలాంటి సమాచారం, ఆన్లైన్ లోనే తెలుసుకోవచ్చు. నా చిన్నతనంలోనే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ లో మా అంకుల్ కి ఉండే అవగాహన నన్ను ఆశ్చర్యపరిచింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి మా అంకుల్ కి కడప ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక షాప్ నడుపుతున్నారు. ఆయన అన్ని రకాల పరికరాలు అమ్ముతారు.
నాకు తీరిక ఉన్నప్పుడల్లా, నేను ఆయన తో కూర్చునేవాడ్ని. మా అంకుల్ ఆ ఎలక్ట్రానిక్స్ మెళకువలు నాకు నేర్పేవారు. నా గ్రాడ్యువేషన్ పూర్తయ్యాక, నాకు కూడా మా అంకుల్ లాగా అవ్వాలని ఉండేది. కానీ, మా అంకుల్ జీవితంలో ఏదైనా కొత్తగా చేయమని నాకు సలహా ఇచ్చారు.
నేను బొంబాయి లో కెమెరా మెకానిజమ్స్ మరియు రిపేరింగ్ లో కోర్సు చేశాను. దీంతో ఈ షాప్ ప్రారంభించాను. నేను ఈ వృత్తిలోకి వచ్చి 10 సంవత్సరాల పైనే అయ్యింది. మా ఆవిడ గృహిణి. నాకు ఇద్దరు కూతుళ్లు.పెద్దమ్మాయి రెండవ తరగతి చదువుతుంది, చిన్నమ్మాయి ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటుంది.ఇందులో వచ్చే ఆదాయం ఇంటికి ఖర్చులకి సరిపోదు. అందుకే, మిక్సర్ గ్రైండర్లు, ల్యాప్ టాపులు, మొబైల్ డివైజులు రేపైర్ట్ చేయడం నేర్చుకున్నాను.
గడిచిన సంవత్సరాలలో నా కస్టమర్లు స్థిరంగా పెరుగుతూ వస్తున్నారు. నా ఇష్టాన్ని, వృత్తిగా మార్చుకోగలిగాను అని గర్వంగా చెప్పగలను. జీవితంలో డబ్బు అవసరమే. కానీ, మనం చేసే పనితో సంతోషంగా లేకపోతే, అసలు అర్థమే లేదు. నేను చేసే పని వల్ల, మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. నాకు ఈ సంతోషం చాలు.”