“నాకు దసరా పండగ ఎప్పుడూ ప్రత్యేకమే. మా ఊరు రాజమహేంద్రవరంలో, నా కజిన్స్ తో కలిసి సరదాగా, పండుగ వేడుకలు జరుపుకొనేవాడ్ని.
పండక్కి, అమ్మ నాకిష్టమని బొబ్బట్లు, పాయసం చేసేది.నాలుగు సంవత్సరాల క్రితం,పని కోసమని నేని విజయవాడ వచ్చేశాను.
ప్రతి సంవత్సరం, పండక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఈ సంవత్సరం పని వల్ల ఊరికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినా, బాధపడే పని లేదు. అమ్మా నాన్నని సర్ప్రైజ్ చేద్దామని గిఫ్ట్ కొరియర్ లో పంపాను. నేను లేకపోయినా, నేను పంపిన బహుమతి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుందని ఆశ!”