“నేను 12వ తరగతిలో ఉన్నప్పుడు నాన్నకి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన కుడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. దీని వల్ల, ఆయనకి పని దొరకడం కష్టమయ్యింది. మా కుటుంబం, ఆయన సంపాదన మీదే ఆధారపడింది. ఆ సమయంలో, మేము ఎన్నో కష్టాలు పడ్డాము.
దాంతో, నేను ఎలక్ట్రిక్ పనులు చేయడం మొదలుపెట్టాను.నేను ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టి దాదాపు 8 సంవత్సరాలు అయ్యింది. నేను చిన్నగా ఉన్నప్పుడు, మా అంకుల్ ఈ ఆటో మొబైల్ గ్యారేజ్ ప్రారంభించారు. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి, ఆయనకి పనిలో సహాయం చేసేవాడ్ని. స్వతంత్రంగా ఉండటానికి, కొత్త విషయాలు ప్రయత్నించడానికి ఇంట్లో నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేవారు.దీని వల్ల, నేను చిన్నతనం నుంచే బండ్లకి సంబంధించిన ఎలక్ట్రిక్ పనులు చేయడం నేర్చుకున్నాను.
12వ తరగతి పరీక్షల తరువాత పై చదువులకోసం వెళ్ళాల్సి వచ్చింది. కానీ, నేను కొద్దిగా విరామం తీసుకుని, గ్యారేజ్ లో పని చేయడానికి నిర్ణయించుకున్నాను. మెల్లిగా డిగ్రీ పూర్తీ చేశాను. పనిలో పడి బిజీ అయిపోవడం వల్ల, డిగ్రీ చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.నేను ఈ గ్యారేజ్ లో ఫుల్ టైం పనిచేయడం మొదలుపెట్టే సమయానికి నా వయసు 17 సంవత్సరాల. నా వయసు చిన్నది కాబట్టి, కస్టమర్లు, నాకు బండ్లు ఇవ్వడానికి ఆలోచించేవారు.ఇప్పుడు వాళ్ళే, నా దగ్గర తప్ప వేరే వాళ్ళకి బండ్లు ఇవ్వడానికి ఇష్టపడరు. ఇది నేను చాలా గర్వపడే విషయం.”