“హలో! నా పేరు నజ్నీన్. నేను రెండవ తరగతి చదువుతున్నాను. నాకు స్కెచింగ్, పెయింటింగ్ అంటే మక్కువ. గతేడాది మా అమ్మ నన్ను పెయింటింగ్ క్లాసెస్ లో చేర్పించింది.
మల్టిపుల్ టాస్కింగ్ చేయడానికి ఇబ్బంది పడేదాన్ని కాబట్టి, మొదట్లో, పెయింటింగ్ క్లాసెస్ కి వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల, స్కెచ్చులు వేయడానికి కావాల్సినంత సమయం దొరికింది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.
నాకు మా స్కూల్ అన్నా కూడా ఇష్టమే. కోవిడ్-19 వల్ల మా స్కూల్ మూసేసి ఆరు నెలల పైనే అయ్యింది.స్కూల్ లేదు కాబట్టి మాకు ఆన్లైన్ క్లాసులలో పాఠాలు చెప్తున్నారు. నేను స్కూల్ ని బాగా మిస్ అవుతున్నాను.
కోవిడ్-19 వైరస్ వల్ల, ప్రపంచం నలు మూలలా ఎంతో మంది బాధపడటం చూస్తే, చాలా విచారంగా ఉంటుంది.
ఈ వైరస్ తొందరగా అంతమవ్వాలని, మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలని అనిపిస్తుంది. మళ్ళీ స్కూల్ కి వెళ్ళి, స్నేహితులతో ఆడుకోవాలని ఉంది. బాగా చదువుకుని, పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని నా కల. డాక్టర్ అయ్యాక, డబ్బులు తీసుకోకుండా, వీలైనంత మంది ప్రజలకి వైద్యం అందిస్తాను!”