“నేను అల్లం టీ, గ్రీన్ టీ, షుగర్ లెస్ టీ అలాగే హనీ లెమన్ టీ కూడా చేస్తాను. కానీ ఏం లాభం?
గత 15 సంవత్సరాలుగా ఇక్కడే టీ అమ్ముతున్నాను. ఇదివరకు, నాకు రోజుకి 800-1000 ఆదాయం వచ్చేది. ఇప్పుడు రోజుకి 150-200 రావడమే కష్టం అయిపోయింది. నా దగ్గరికి వచ్చే కస్టమర్లలో ఎక్కువ శాతం ప్రైవేట్ ఆఫిసుల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగస్తులే. కరోనా మహమ్మారి వల్ల, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొంతమందైతే, పని చేసే దగ్గరే టీ తయారుచేసుకుంటున్నారు.
ప్రజల్లో భయం నాటుకుపోవడం వలన, ఆరోగ్య రీత్యా చాలా మంది అసలు బయట టీ తాగడమే మానేశారు. వాళ్ళు మా లాంటి రోజువారీ సంపాదించే వారి గురించి కూడా ఆలోచించాలి. క్యాష్ లెస్ ట్రాన్సక్ల్షన్స్ కోసం నా ఫోన్ లో డిజిటల్ వాలెట్ కూడా ఇంస్టాల్ చేసుకున్నాను. కస్టమర్ల భద్రతా కోసం నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, నా జీవనాధారానికే ఎటువంటి భరోసా లేదు. ఈ లాక్డౌన్ సమయంలో, నేను పొదుపు చేసిన డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. పరిస్థితి మరీ కష్టతరంగా మారింది.”