“నేను గత 10 సంవత్సరాలుగా కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాను. నా భర్త కి సాయంగా ఉండటానికి, పిల్లలకి మంచి చదువు చెప్పించడం కోసం నేను ఇటు వైపు వచ్చాను. కొబ్బరి కాయలు ఎలా కొట్టాలో సొంతంగా నేర్చుకున్నాను. మెల్లి మెల్లిగా మొదలుపెట్టి ఇప్పుడునిష్ణాతురాలినయ్యాను. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పని చేస్తాను. నా కొట్టు బీఆర్ టీ ఎస్ రోడ్ లో ఉంది కాబట్టి, నాకు మధురా నగర్ జంక్షన్ ని వెళ్ళడం చాలా తేలిక.
నా దగ్గరికి వచ్చే కస్టమర్ లు చాలా మంది లేత కొబ్బరి కోసమే కొబ్బరి బోండాలు తాగుతారు. స్ట్రా లు ఇవొద్దని చెప్తారు. ఈ మధ్య నేను బొండం లోపల ఉండే కొబ్బరి తీయట్లేదు. కస్టమర్లను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. వైరస్ లక్షణాలు ఉన్న వారు ఎవరైనా స్ట్రా లేకుండా తాగితే ఆ క్రిములు అలాగే ఉండిపోతాయి. అందుకని కస్టమర్లను కొబ్బరి నీళ్లు పార్సిల్ తీసుకుని వెళ్ళమని అడుగుతున్నాను. లోపల ఉండే గుజ్జు పడేయడం వల్ల డబ్బులు, ఆహారం వృధా అవుతుందని చాలా మంది అనుకుంటారు. కస్టమర్ల కి కోపం రావచ్చు కానీ, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన జాగ్రత్తలు కూడా పాటించాలి కదా. కస్టమర్లు ఆరోగ్యం గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా కూడా మా వ్యాపారం నష్టాల్లో నడుస్తుంది.
లాక్డౌన్ వల్ల బాగా నష్ట పోయాం. ఇక వర్షాకాలం కూడా మొదలవబోతుంది కాబట్టి కొబ్బరి నీళ్లు చాలా తక్కువ మంది తాగుతారు. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. చిన్నవాడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. రాబోయే కాలం కష్టంగా ఉండొచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం నేను మరింత ఎక్కువ కష్టపడతా.”