“ఈరోజు నేను, అన్నయ్య ఇంట్లో క్రికెట్ ఆడుతున్నాం. అన్నయ్య వేసిన ఫుల్ టాస్ బంతిని నేరుగా వంటగదిలోకి కొట్టాను. ఆ బాల్ సిక్స్ వెళ్ళింది కానీ ఆట ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను కొట్టిన బాల్ పల్లీల జాడికి తగిలింది. అదృష్టం ఏంటంటే అప్పుడు అమ్మ సూపర్ మార్కెట్ కి వెళ్ళింది.మేము వంటింట్లో అన్నీ సర్దేశాము. అన్నయ్య గాజుపెంకులని జాగ్రత్తగా తీసేసాడు, నేను చెల్లాచెదురైన పల్లీలన్నిటినీ పోగుచేశా. అలా పైకి చేసేసరికి అమ్మ వంటగది దగ్గర సామాన్లతో నిలబడి ఉంది. సడన్ గా అమ్మని అలా చూసేసరికి షాక్ అయ్యాము.అమ్మ మా వైపు కోపంగా చూసి ఏం అనకుండా వెళ్ళిపోయింది.అప్పటి నుంచి అమ్మ మాతో మాట్లాడడం మానేసింది.నేను ఎంత ప్రయత్నించినా అమ్మ మాత్రం నవ్వడం లేదు. అమ్మ మమ్మల్ని క్షమిస్తుందనే అనుకుంటున్నా కానీ అమ్మ చాలా కోపంగా ఉంది. రోజంతా సమయం ఉంది కాబట్టి నేను అంతగా ఆందోళన చెందట్లేదు. నా ఐస్ క్రీమ్ స్కూప్ ని అమ్మకి ఇస్తాను. అప్పుడైనా అమ్మ నవ్వుతుందేమో చూడాలి.”