“పెద్దయ్యాక ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని, చిన్నప్పటినుంచి కలలు కనేవాడ్ని. ఎన్నో కష్టాలు పడిన తరువాత, రెండేళ్ళ క్రితం నా కల సాకారమైంది. ఫిబ్రవరి దాకా నా రెస్టారెంట్ బాగానే నడిచేది కానీ, కోవిడ్-19 వ్యాప్తి, దేశవ్యాప్త లాక్డౌన్ మూలంగా మాకు కష్టాలు ఎదురయ్యాయి. నా రెస్టారెంట్ లో 12 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు కుటుంబాలని పోషించుకోవాలి కాబట్టి, లాక్డౌన్ ఉన్నా కూడా వాళ్ళకి సగం జీతాలు ఇస్తున్నాను. వాళ్ళు పరిస్థితి ఎం,ముందు నా కష్టాలు చిన్నవిగా తోచాయి. గత రెండు నెలలు పరిస్థితి చాలా కష్టంగా మారాయి. రాబడి ఏం లేదు కానీ ఖర్చులు మాత్రం పెరిగాయి. ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు సడలించారు కాబట్టి, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ కేవలం 50% మంది స్ట్రాఫ్ తోటే గత వారం రెస్టారెంట్ తెరిచాను. నా రెస్టారెంట్ కి వచ్చే వినియోగదారుల్లో, రోజువారీ కూలీలు, స్టూడెంట్స్, కుటుంబాలు, ఆఫీసుకి వెళ్ళేవారు ఇలా అందరూ ఉంటారు. వ్యాపారం పూర్తిగా మొదలుపెట్టినా ఇంతకూ ముందులా కస్టమర్లు వస్తారని నమ్మకం లేదు. అందుకనే హోమ్ డెలివరీస్, టేక్ అవేస్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. నేను డబ్బు కోసం వ్యాపారం చెయ్యట్లేదు, ఇక్కడికి వచ్చేవాళ్ళు దీన్ని ఇల్లులా భావించాలి అంతే. నేను, నా స్టాఫ్ వినియోగదారులకి సంతోషంగా ఫుడ్ సర్వ్ చేసే రోజులని మిస్ అవుతున్నాం. జీవితం ఇంతకూ ముందులా ఉండదు, ఈ కొత్త మార్పుని మనం అలవర్చుకోవాలి!”