“గత 10 సంవత్సరాలుగా నేను ఈ కార్ షో రూమ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత, షో రూమ్ కి వచ్చే కస్టమర్లని బయటే ఆపి శానిటైజర్ లో చేతులు కడుక్కున్నాకే లోపలికి వెళ్ళనిస్తాను. నేను కస్టమర్ల టెంపరేచర్ కూడా పరీక్షిస్తాను. ఈ బిల్డింగ్ లో ఉండే వాళ్ళ అందరినీ రక్షించడం నా బాధ్యత. కానీ కొన్నికొన్ని సార్లు అనిపిస్తుంది, ప్రజలు సమస్యని అర్థం చేసుకోవట్లేదని. కొంత మంది కస్టమర్లని భౌతిక దూరం పాటించేలా ఒప్పించడం కూడా కష్టమవుతుంది. కస్టమర్లు భౌతిక దూరం పాటించకపోవడం వల్ల మా పై అధికారులు నన్ను తిడుతూ ఉంటారు. అలాంటప్పుడు తప్ప, మిగతా కస్టమర్లు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కోవిడ్-19 వైరస్ బారి నుంచి నేను షో రూమ్ ని కాపాడుతున్నా, నాకే ఏ విధమైన రక్షణా లేదు. అయినా పర్వాలేదు. మా యజమాని నేను సరిగా పనిచేయలేదు అనుకోకూడదు అంతే. యోధులు యుద్ధరంగం నుంచి పారిపోరు. అవునా కాదా?’