“చిన్నతనం నుంచి నాకు పెయింటింగ్ అన్నా, బొమ్మలు వేయడం అన్నా ఆసక్తి ఉండేది. సాయంత్రాల్లో, మా ఊరి ప్రజలు ఎదుర్కునే వివిధ సామజిక సమస్యల మీద కాన్వాస్ లు గీసేవాడ్ని. దీని వల్ల, నాకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహించే వార్షిక కళా ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లభించింది. ట్రస్ట్ వారిచ్చే ప్రోత్సాహంతో రాష్టంలో పలు కళా ఉత్సవాల్లో పాల్గొనడం ప్రారంభించా. మా అమ్మా నాన్న, వ్యవసాయ కూలీలైనా కూడా నన్ను ప్రోత్సహించేవారు. నాకిష్టం కాబట్టి వాళ్ళు నన్ను ప్రోత్సహించలేదు, నా కళా ద్వారా సమాజానికి ఎంతో కొంత దోహదం చేయాలని వాళ్ళ ఆశ. దాంతో నేను గ్రాడ్యువేషన్ లో బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు తీసుకున్నాను. ఇప్పుడు నేను గ్రాడ్యువేషన్ చివరి సంవత్సరం చదువుతున్నాను. కరోనా వైరస్ వల్ల మా పరీక్షలు వాయిదా వేశారు. ఈ ఫ్రీ టైం లో, మా ఊరివాళ్ళు భౌతిక దూరం పాటించడం, ఇతర పరిమాణాలు పాటించేలా ప్రోత్సహించడానికి ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాను. ఊరిలో అందరికీ టీవీ, ఇంటర్నెట్ సదుపాయం లేదు కాబట్టి, స్ట్రీట్ పెయింటింగ్ అందరికీ అందుబాటులో ఉంటుందనిపించింది. స్థానిక పంచాయితీ నుంచి, పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోవడం వల్ల, లాక్డౌన్ ఉన్నా కూడా నన్ను ఎవరూ ఆపలేదు. నేను ఏదైనా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ప్రజలు నా పని గురించి ఎన్నో విషయాల గురించి అడుగుతుంటారు. అల మాటలు కలుపుతూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వారికి అవగాహన కల్పిస్తుంటాను.
నా సొంత ఖర్చుల మీద ఇప్పటివరకూ 50 గ్రామాలలో పెయింటింగ్ చేశాను. నా కళ ద్వారా మరింత మందికి అవగాహన కల్పించడమే నా ఆశయం. ఇలా చేయడం వల్ల, రేపటి మంచి కోసం సమాజానికి నా వంతు సహాయం అందించగలను!”