“నా కూతురు నాకు మంచి మిత్రురాలు. దేని గురించి ఆలోచించకుండా మేము ప్రపంచంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాము.
ఒక చోట ఆగిపోకుండా కొత్త విషయాలు నేర్చుకోవటానికి నా కూతురే నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది.నాకు టెక్నాలజీ గురించి అంతగా తెలీదు కానీ తనే నాకు స్మార్ట్ ఫోన్ వాడటం, బంధువులతో వీడియో కాల్ చేయడం నేర్పించింది. సాయంత్రాల్లో నేను ఖాళీగానే ఉంటాను, ఈ సమయంలో నేను డ్రైవింగ్ నేర్చకోవాలని, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని చెప్తుంది.నేర్చుకోవడానికి ఒక వయసంటూ లేదని, ఎంత వయసున్నా ఏదో ఒకటి నేర్చుకోవచ్చని తను బలంగా నమ్ముతుంది.
చిన్నప్పటి నుంచి నేను తన ఇష్టాలని ఎప్పుడూ కాదనలేదు,ఎందుకంటే తనకి ఎప్పుడూ సమాజానికి ఎదో ఒక మంచి చేయాలనే తాపత్రయం. మా ఆయనకి ఒక చిన్న మెడికల్ షాప్ ఉంది, నేను ఇంట్లో ఉండి పనులు చూసుకుంటాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తనని చదివించాం.తను జీవితంలో సొంతంగా కెరీర్ ఎంపిక చేసుకోవాలని తనకి మంచి చదువు చెప్పించాం, తగినంత స్వేచ్ఛ కూడా ఇచ్చాం. ప్రస్తుతం తను జిల్లా వాలంటీర్ గా పనిచేస్తుంది.
అంతా నిన్న జరిగినట్టే ఉంది, కాలం చాలా తొందరగా గడిచిపోయింది. తను రోజూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నన్ను పని దగ్గర దింపేసి వెళుతుంది.తను చిన్నతనంలో గొడవ చేసిన, ఇంట్లో ఆడుకునే సందర్భాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయాన్ని అక్కడే ఆపేసి, తనని మళ్ళీ చిన్నపిల్లగా చూడాలని ఉంది. తన ఎదుగుదలని నేను ఆపలేను కానీ తను పెరిగేటప్పుడు తనకి తోడుగా ఉండగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.నేను జీవితంలో ఎప్పుడూ చేయలేను అని అనుకున్న విషయాలని నాకు నేర్పింది.”