టీమ్ హెచ్ఓఏ: హాయ్. ఏం చేస్తున్నావ్?
పిల్లాడు:నేను నా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాను
టీమ్ హెచ్ఓఏ: ఆప్త స్నేహితులా? మాకు ఎవరూ కనిపించట్లేదే?
పిల్లాడు: నేను చెప్పేది ఈ కార్ బొమ్మల గురించి. అవే నా ఆప్త స్నేహితులు
టీమ్ హెచ్ఓఏ: అలాగా. అయితే నీకు ఎంత మంది ఆప్త స్నేహితులు ఉన్నారు?
పిల్లాడు: నాకు 50 కంటే ఎక్కువ మంది ఆప్త స్నేహితులు ఉన్నారు తెలుసా
టీమ్ హెచ్ఓఏ: ఓ. చాలా మంచి విషయం. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో?
పిల్లాడు: మా తాతయ్య తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను. నా ఆప్త మిత్రుల్లో కొన్నిటినీ మా చుట్టాలకు ఇచ్చేద్దామని అనుకున్నా.
టీమ్ హెచ్ఓఏ: అవునా. ఎందుకు?
పిల్లాడు: మా ఆప్త మిత్రుల్లో కొంతమందికి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. నాకు నేనుగా నడిపే కారు ఒకటి కావాలి. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే జూన్ లో మంచి కారు కొనిపిస్తాను అను చెప్పారు.
టీమ్ హెచ్ఓఏ: అలాగా. మరి బాగా చదువుతున్నావా?
పిల్లాడు: సెలవుల్లో నేనెందుకు చదువుకోవాలి? నేను చదువుకోను.నేను నడపగలిగే కారు రాబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది.
టీమ్ హెచ్ఓఏ: ఏంటీ? చదువుకోకపోతే కారు ఎలా వస్తుంది?
పిల్లాడు: ఈ సంవత్సరం మాకు ఫైనల్ పరీక్షలు ఉండవని మా టీచర్ చెప్పారు.మమ్మల్ని పై తరగతులకు ప్రమోట్ చేశారు.