“నా మనవళ్ళు, మనవరాళ్లతో చక్కటి అనుబంధం ఉంది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల 8 సంవత్సరాల్లో మొదటిసారి వేసవి సెలవులకి వాళ్ళని కలవలేకపోతున్నా.
మాది బాపట్ల, నా పెళ్ళి తరువాత నేను గుంటూరు జిల్లా పెనుమూడి కి మకాం మార్చాను.మాది చాలా సంతోషమైన కుటుంబం.మా పిల్లలిద్దరూ వాళ్ళ పెళ్ళిళ్ళ తరువాత వేరే చోట్లకి వెళ్ళారు. వాళ్ళకి నగరాల్లో ఉండే సదుపాయాలు అన్నీ కావాలంట. అయితే నేను వాళ్ళకి చెప్పాను మన పల్లెటూరు మూలాలు మర్చిపోకూడదని.అందుకనే వేసవి సెలవులకి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెలవలు అయ్యేదాకా ఇక్కడే ఉంటారు.వాళ్లందరికీ పల్లెటూరు ఆహారం అంటే ఇష్టం. నేను వాళ్ళకి జొన్న రొట్టే, రాగి సంకటి వాటిలోకి గుత్తి వంకాయ, ఆవకాయ పచ్చడి చేస్తాను.కుటుంబ సభ్యులు అందరూ మామిడి చెట్టు కింద కూర్చుని, మామిడిపళ్ళు, మిజ్జులు తింటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం.నేను పిల్లలకి పల్లెటూరు జీవితం నేర్పిస్తే వాళ్ళు నాకు నగర జీవితం గురించి నేర్పించేవాళ్ళు. నాకు స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో కూడా వాళ్ళే నేర్పించారు.
ప్రతి సంవత్సరం వాళ్ళు కోత సమయానికి ఇక్కడికి వస్తారు, నేను శీతాకాలంలో సిటీ కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి వస్తాను.అక్కడ షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు చూసి వస్తాను, దీంతో రెండు వేరు వేరు ప్రపంచాలు చూసినట్టు అవుతుంది.లాక్డౌన్ వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి వీడియో కాల్స్ తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను.వాళ్ళకి నా ఆరోగ్యం గురించే ఆందోళన. ఈ రోజుల్లో పురోగతి మంచిదే కానీ మన మూలాలను కూడా మర్చిపోకూడదు. మేము ఆ సూత్రాన్ని పాటిస్తునందుకు చాలా సంతోషంగా ఉంది.”