“నేను క్రికెట్ కి వీరాభిమానిని. స్నేహితులతో కలిసి ప్రతి మ్యాచ్ చూసేవాడిని. నాకు ఈమధ్యే పెళ్ళి అయ్యింది, దీంతో మ్యాచులు చూడటానికి వీలవ్వట్లేదు. నా భార్యకి క్రికెట్ అంటే నచ్చదు. క్రికెట్ మ్యాచులు బోరింగ్ అని చెప్తుంది. దీంతో సాయంత్రం నా పనయ్యాక ఇద్దరం కలిసి ఆమెకి ఇష్టమైన టీవీ షోలు చూస్తాం. అయినా పర్వాలేదు మ్యాచ్ స్కోర్ నా ఫోన్ లో చూస్తాను. టీవీ షోలు చూస్తే నా భార్య చాలా సంతోషంగా ఉంది అందుకే క్రికెట్ వదులుకున్నా నాకు బాధ అనిపించదు. ఆమెని సంతోషంగా చూడటం కన్నా నాకింకేం కావాలి చెప్పండి?”