“నేను గత 15 సంవత్సరాలుగా విజయవాడ శివారు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతాను.ఈ లాక్డౌన్ ఉన్నంతవరకూ నేను మా కుటుంబాన్ని పోషించడానికి డబ్బు సంపాదించలేను.లాక్డౌన్ మూలాన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముందుజాగ్రత్త చర్యలను పాటిస్తున్నాను.
నాకు కరోనా గురించిన అవగాహన ఉంది. ఈ మహమ్మారి చాలా ప్రమాదకరమైంది, దీంతో పోరాడటానికి ప్రపంచం మొత్తం సన్నద్ధమవుతోంది.స్తోమత ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉండి పనిచేయగలిగేవాళ్ళు ఇళ్ళకే పరిమితం అయ్యారు. మా లాంటి వాళ్ళకి ఆ అవకాశం లేదు, మాది నమ్మకానికి, సౌకర్యానికీ మధ్య ఉండే ఎంపిక. ఈ రెండిటీ మధ్య దేన్ని ఎంచుకోవాలి చెప్పండి?
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి, బయటకి వెళ్ళలేని వాళ్ళందరూ పాలు సరఫరా చేయడానికి నన్ను పిలిచేవాళ్ళు.ఎప్పుడూ లేని విధంగా వినియోగదారులు నా మీద ఆధారపడ్డారు.వాతావరణం సరిగా లేకపోయినా కూడా నేను పాలు సరఫరా చేస్తాను అను వాళ్ళు నమ్ముతారు.అందుకనే, ప్రతిరోజూ సమయానికి పాలు సరఫరా చేయడం నా బాధ్యత అని బలంగా నమ్ముతాను!”