“నేను గత 13 ఏళ్ళ నుంచి రోడ్లు ఈడ్చే వృత్తిలో ఉన్నాను. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నాలుగు రోజుల నుంచి దేశం మొత్తం లాక్డౌన్ లో ఉంటూ, కరోనా మహమ్మారి వ్యాపించకుండా పోరాడుతున్నారు. బయట పరిస్థితులు బాగాలేవు కాబట్టి, మా ఆయన పనికి వెళ్ళొద్దని చెప్తున్నారు.నేను ఇంట్లో కూర్చుంటే, నా పనికి గౌరవం ఏముంటుంది?
ఈ పరిస్థితుల్లో పని చేయాలంటే ఇబ్బందే కానీ, ప్రజలు కష్టపడుతుంటే చూడలేను. అందుకనే, నా సహ ఉద్యోగులతో కలిసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి రోజుకి 14 గంటలు కష్టపడుతున్నాం.బయటకి రావద్దని, ప్రభుత్వం ఆదేశించినా, జనాలు బయటికి వస్తున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. వేరే వాళ్ళకి సలహా ఇచ్చేంత పెద్ద దాన్ని కాదు కానీ, నేను కోరేది ఒకటే ఇళ్లల్లో ఉండండి, మీరు శుభ్రంగా ఉండండి, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచండి.”