కొన్నిరోజుల క్రితం మా అంకుల్ పక్కనే ఉన్న బేకరీ లో నాకు రుచికరమైన దిల్ ఖుష్ కొనిచ్చారు. మా చెల్లెలతో దిల్ ఖుష్ పంచుకోనందుకు నాకు చాలా బాధగా అనిపించింది. అందుకని అప్పటి నుంచి వాళ్ళకి స్వీట్లు కొనడానికి డబ్బులు పోగుచేస్తున్నాను. ఆ డబ్బులతోనే ఇవి కొన్నాను. ఈరోజు అందరం కలిసి వీటిని తింటాం. ఇంట్లో కుటుంబం అందరం కలిసి తింటే తినే పదార్థాలు రుచిగా ఉంటాయని మా నమ్మకం. కాదంటారా?
దిల్ ఖుష్ !
by editor
0 Comments