“నేను పుట్టింది, పెరిగింది గుంటూరు లో. మా నాన్నకి ఒక చిన్న ఫుడ్ బిజినెస్ ఉంది కానీ ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూశారు. ఒకానొక సమయంలో అప్పులు తీర్చడానికి మేము ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది. దీంతో మా కుంటుంబానికి ఎలాగైనా సాయం చేద్దామని అనుకున్నా, అందుకనే నేను స్కూల్, కాలేజీ లో బాగా చదివేవాడిని. డిగ్రీ చదివేటప్పుడు నాకు ఒకటే కల, మాస్టర్స్ చదవడానికి మెరిట్ స్కాలర్షిప్ సంపాదించాలని. కానీ, ఫైనల్ ఎగ్జామ్స్ కి కొన్ని నెలల ముందు మా నాన్న ఆరోగ్యం బాగాలేదు, దీంతో నేను ఆయన బదులు పనిచేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద నేను ఎగ్జామ్ రాయగలిగాను. ఉదయం కాలేజీకి వెళ్ళి, సాయంత్రం హోటల్ చూసుకునేవాడ్ని. అన్ని పనులు నేనూ చేసుకోవాలి కాబట్టి, ఒక్కోసారి 4 గంటలు కూడా నిద్ర ఉండేది కాదు. దీని వల్ల ఇంట్లో వాళ్ళు బాగా బాధపడేవాళ్ళు, కానీ ఇదే మా ఆదాయ మార్గం. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి అంత టైం దొరకలేదు, అందుకే 73% మార్కులు మాత్రమే సాధించగలిగాను. నేను మాస్టర్స్ చేయాలని అనుకున్నప్పుడు, చదువుకి ఇబ్బంది కలుగకూడదని మా హోటల్ ని అద్దెకి ఇచ్చారు. వాళ్ళు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు చదువుకుంటే ఏ స్థాయిలో ఉండేవాళ్ళో అనిపిస్తుంది. వాళ్ళ అంచనాకి తగట్టు నేను ఉండాలి అని అనుకుంటాను, ఎందుకంటే క్లిష్టసమయాల్లో వాళ్ళే నా పక్కన ఉన్నారు. అందుకుని నేను ఒక స్థానిక ఎన్జీఓ లో చేరాను. అది పిల్లల అభివృద్ధి కోసం, అనాధ పిల్లలకి ఉచితంగా చదువు చెప్తారు. ప్రతిరోజూ నేను చదవగలిగి ఉండి, పనులు చేసుకునే చాలా మందిని చూస్తాను. ఇప్పుడు నాకొక మంచి యూనివర్సిటీ లో సీట్ దొరికింది. నేను నేర్చుకున్నదంతా ఆచరణలో పెట్టి, నాలాంటి పరిస్థితులు ఎదురుకున్న వాళ్ళ జీవితాల్లో మార్పు తేవాలని ఉంది.”