“నాకు కొత్త ప్రదేశాలకి వెళ్ళాలంటే ఇష్టం. పెళ్లికాక ముందు నేను బాగా ప్రయాణించేవాడ్ని కానీ, పెళ్ళి తరువాత పిల్లలు, బాధ్యత, పని వల్ల నా సమయం అంతా గడిచిపోయేది. మేము అప్పుడప్పుడూ అలా కుటుంబంతో కలిసి వెళ్ళేవాళ్ళం కానీ అది అంతా గుర్తుపెట్టుకునేలా లేదు. కొన్ని నెలల క్రితం నాకు అనిపించింది, నాకు ఎంతో ఇష్టమైన ప్రయాణాన్ని నేను మరిచిపోతున్నాను అని. అన్నిటి నుంచి కొంచం విరామం కావాలి అని అనిపించింది. అందుకని నేను కొంత మంది స్నేహితులని ఒక సర్ప్రైజ్ ట్రిప్ కి ఆహ్వానించాను. అప్పటి దాకా నేను చూడని ప్రదేశంలో ప్రయాణించాలి అనిపించింది. నా ఆలోచన చెప్పగానే నా స్నేహితులు కూడా ఎంతో ఉత్సాహ పడ్డారు. దీని గురించే మేము రోజుల తరబడి మాట్లాడుకున్నాం. మా ప్రయాణానికి సన్నాహాలు, సామాన్లు సర్దడం, షాపింగ్ కొన్ని వారాల ముందే పూర్తిచేశాం. మేము కాశ్మీర్ కి ప్రయాణం అవ్వడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
మేము అక్కడికి సరైన సమయంలో వెళ్ళాం కాబట్టి, జీవితంలో మొదటిసారి మంచు పడటం చూసాం. మొదటిసారి మంచుని తాకినప్పుడు, మా స్నేహితుల మొహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవి మా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన సందర్భం. అక్కడ పరిస్థితులను తట్టుకోవడానికి మేము కొంచం సమయం పట్టింది కానీ, పెద్దగా కష్టం అనిపించలేదు. కాశ్మీర్ కి వెళ్లడం కంటే ఆనందకరమైన సందర్భం ఇంకొకటి లేదు. కానీ నేను వేరే ప్రదేశాల గురుంచి ఆలోచిస్తున్నాను. మా కుటుంబంతో కలిసి భారతదేశంలోని మరిన్ని వింతలూ చూడటానికి నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. నా భార్య, కూతురు మరిన్ని ప్రదేశాలు చూడాలి.”