“ప్రతి సంవత్సరం మేము సంక్రాంతిని ఉత్సాహం, ఆనందంతో జరుపుకుంటాం. మా పాలగుట్టపల్లెలో, సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటాము. మూడవ రోజైన సంక్రాంతిని మేము ఎద్దుల పండగ అంటాం.
దేశంలోని ఇతర ప్రాంతాల లాగానే, మేము కూడా జంతువులని పూజిస్తాం, కాలానుగుణంగా పంట పండిస్తాం, ఎందుకంటే మా పొలాలని సంపన్నం చేసే గోమయంలో మేము ఆధ్యాత్మికతని చూస్తాం. ఈరోజు మేము తెల్లవారు జామునే లేచి, ఇళ్లను శుభ్రం చేస్తాం.ఇంట్లో ఉండే ఆవులు, ఎద్దులు, దూడలకి స్నానం చేసి అందంగా అలంకరిస్తాం. స్నానం చేపించాక, వాటి కొమ్ములకి ఉండే పాత పెయింట్ ని తీసేసి, కొత్త రంగు వేస్తాం. ఆవుల మొహానికి, వెనక భాగంలో, తోకకి పసుపు, కుంకుమ బొట్లు పెడతాం.
రకరకాల గడ్డి, మూలికలు సేకరించి ఇంట్లోని ప్రతి గుమ్మం ముందర ఉంచుతాం. ఆ తరువాత ఆకులు పశువులకు మేత వేస్తాం. గోమయంతో గౌరమ్మని చేసి అలంకరిస్తాం. గోశాలలో పశువులకి రాగి సంకటి వండి, పసుపు, కుంకుమ తో పాటు ఆకుల మీద పెడతాం. కర్పూరంతో, పశువులకు హారతి ఇస్తాం. గౌరమ్మకి ధూప దీప హారతులు ఇస్తాం.
చీకటి పడ్డాక, మేత మేయడం అయ్యాక, పశువులని ఊరు అవతల ఉండే కొండ ప్రాంతానికి తీసుకుని వెళతాం. అక్కడ గంగమ్మతల్లి సోదరుడైన, కాటవ రాజుడిని పూజిస్తాం. మూడు రాళ్ళని పెట్టి,ఆ రాళ్ళని ఎర్ర మట్టి, సున్నం తో ఎరుపు మరియు తెలుపు రంగులు వేసిన చిన్న రాళ్లు వేసి ఆయన శిలని ఏర్పాటు చేస్తాం. ఆ శిలకి కొబ్బరి, కర్పూరం, తలుగు లేదా ఇతర ఆహార పదార్ధాలు సమర్పిస్తాం. ఆ తరువాత అక్కడ భోగి మంటలు వేస్తాం. ఇలా చేయడం వల్ల, ఊరికి పట్టిన దరిద్రం పోతుంది అని నమ్ముతారు కాబట్టి, ఇది ఊరికి చాలా మంచిది అని నమ్ముతారు. పశువులని భోగి మంటల దగ్గరికి తీసుకుని వెళ్తాము. ఆ మంటల నుంచి వచ్చే బూడిదని పశువుల తలకి పెడతాం. పశువులు ఇంటికొచ్చే దగ్గర కర్పూరం చుట్టూతా అలంకరిస్తారు. ప్రతి ఇంటి నుంచి, ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వాటితో బెల్లం ప్రసాదం తయారుచేసి, రాత్రికి అందరికీ పంచిపెడతాం. అప్పుడప్పుడూ, ఎద్దులు తరమటం అనే ఎడ్ల పందాలు మా ఊరిలో జరుపుతారు. ఆ పందెం తరువాత, ఎద్దులని, దూడలని మాతో పాటు ఇంటికి తీసుకునివెళతాం.”