“నేను ఇంట్లో అన్నీ పగలగొడతాను, కదిలిస్తూ ఉంటాను కాబట్టి నేను విలన్ ని మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నా దగ్గరున్న వస్తువులన్నీ పగలగొట్టాను కాబట్టి గత మూడు నెలలుగా మా నాన్న నాకేమీ కొనిపించడం లేదు. అయినా కూడా ఇమ్రాన్ వాడి దగ్గర ఉండే వస్తువులు నాతో పంచుకుంటాడు, వాడు నా ఆప్త మిత్రుడు. కొన్ని నెలల క్రితం నా బ్యాట్మింటన్ రాకెట్ పోయింది. అందుకని నాకు ఆడుకోవడానికి రాకెట్ లేదు. ఇమ్రాన్ కొంత సమయం ఆడుకోవడానికి వాడి రాకెట్ నాకిస్తాడు. ఈ సంవత్సరం నుంచి ఇంట్లో వస్తువులు విరగ్గొట్టనని మా నాన్నకి మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకుంటే కొత్త క్రికెట్ బ్యాట్ కొనిపిస్తానని మా నాన్న చెప్పారు. దీంతో నేను, ఇమ్రాన్ కలిసి ఆడుకోవచ్చు. మరింత బాధ్యతగా ఉండటం, నా దగ్గర ఉన్న వాటిని ఇతరులతో పంచుకోవడం, ఇదే 2020 నా కొత్త రెసొల్యూషన్.”