“బాలల దినోత్సవం అంటే నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ రోజు కోసం మేము సంవత్సరం అంతా ఎదురుచూస్తూ ఉంటాం. ఈరోజు మేము మా టీచర్లని అనుకరిస్తాము, రోజువారీ తరగతుల నుంచి తప్పించుకుంటాము . స్వీట్లు, స్నాక్స్ ఇస్తారు కాబట్టి, మేమందరం ఈరోజు జరిగే అసెంబ్లీ కి వెళ్తాము. పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డు బహుకరణ ఉంటుంది. పిల్లలందరికీ చదువు, పోషణ, ప్రతి విషయంలో ఉత్తమమైనవి దొరకాలనేదానికి ఈరోజు సూచిక. మేము భావి దేశపు పౌరులం కాబట్టి, మేము ఎలా పెరిగాం అనే దాన్నిబట్టి ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.”