“అప్పట్లో సంపాదనకు వేరే మార్గం లేక నేను ఆటో నడపడం మొదలుపెట్టాను. టూరిస్టుల నుంచి స్థానికుల వరకు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఎంతో మంది నా ఆటో లో ప్రయాణించారు. అలా ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక వృద్ధ దంపతులు వచ్చారు. వాళ్ళ వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటుంది, వాళ్ళు విశాఖపట్నం మొత్తం చూపించమని అడిగారు. అలా ఉదయం ప్రయాణం మొదలుపెట్టి, అర్థరాత్రి వరకు నగరం మొత్తం తిరిగాము. వాళ్ళ కోరిక తీర్చగలిగినందుకు నాకు సంతోషంగా అనిపించింది. మా ప్రయాణంలో బీచ్ చూశాం, గుళ్ళని దర్శించాము, సాంప్రదాయ ఆంధ్ర వంట తిన్నాం, పాటలు విన్నాం. ఈ ప్రయాణాన్ని మేము బాగా ఆస్వాదించాం. నేను వాళ్ళని నగరం అంతా తిప్పగలిగినందుకు ఆనందపడ్డాను. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అనిపిస్తుంది, నా ఆటో కేవలం జీవనాధారాన్ని మాత్రమే కాదు సంతోషంగా ఉండటానికి జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి కూడా అవకాశం ఇస్తుందని.”