“నాకు ఒక 9 ఏళ్ళ కొడుకు ఉన్నాడు, వాడికి ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. వాడికి మీ దగ్గర ఉన్నటువంటి కెమెరా కావాలట. నాకు దాన్ని కొనే స్తోమత లేదు అందుకనే సెకండ్ హ్యాండ్ కెమెరా కొందాం అని నిశ్చయించుకున్నా. అవి కూడా బాగా ఖరీదుంటాయి, బాగా వాడినట్టు అలాగే పాత పడినట్టు కనిపిస్తాయి. నాకు వాడికి కొత్త కెమెరా కొనివ్వాలని ఉంది, అందుకే నేను మూడు సంవత్సరాలుగా డబ్బులు పోగు చేస్తున్నాను. బాగానే డబ్బు పోగు చేశాను, త్వరలోనే కొత్త కెమెరా కొంటాను. వాడి కలల్ని నిజం చేయగలిగే బహుమతి ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.”