“మా పెళ్ళి తరువాతే నేను మా భార్యని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. 35 సంవత్సరాల క్రితం, పిల్లలు పుట్టాక, జీవితం అంతా వాళ్ళతోనే సరిపోయింది, మాకంటూ అసలు సమయం ఉండేది కాదు. ఖర్చులకి సరిపడా సంపాదించడానికి మేము ప్రతి రోజూ కష్టపడే వాళ్ళం. పిల్లల భవిష్యత్తు ఆలోచించి, వాళ్ళ ఇష్టాలకి అనుగుణంగా డబ్బు దాచిపెట్టేవాళ్ళం. మాకున్నదాంట్లోనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నించాం. ఆ సమయంలో మేము ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకున్నాం. మాకున్న బాధ్యతని వాళ్ళ మీద రుద్దాలని అనుకోలేదు. ఇప్పుడు పిల్లలందరూ సొంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకంటూ కుటుంబాలు ఉన్నాయి. అప్పుడప్పడూ వచ్చి చూస్తూ ఉంటారు కానీ, ఇప్పుడు నేను, నా భార్య ఇదే నా జీవితం. ఇన్నేళ్ళలో మా జీవితంలో బాగా మార్పులొచ్చాయని తెలుసుకున్నాం, అప్పటితో పోలిస్తే మేము ఇప్పుడు వేరే మనుషులుగా ప్రవర్తిస్తున్నాం. మా బాధ్యతలు తీరిపోయాక, ఇప్పుడు జీవితం మరింత అందంగా ఉందనిపిస్తోంది, ఇక మా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపొచ్చు.”