“రేపు దీపావళి, మేము చాలా సంతోషంగా ఉన్నాము. లైట్లు,దీపాలు, పూలతో ఇంటిని అలంకరించడంలో అమ్మ నిమగ్నం అయ్యింది. రేపు టపాసులు బాగా కాల్చాలని నిర్ణయించుకున్నాను. కానీ నా తమ్ముడికి టపాసులు అంటే చాలా భయం. అందుకే వాడు మాతో ఆడుకోవడానికి రాడు. టపాసులు కాలిస్తే కాలుష్యం అంటాడు. అది నిజమే కావచ్చు, కానీ నేను భూచక్రం, చిచ్చు బుడ్డి కాలుస్తాను. అవి అంటే నాకు ప్రాణం. దీపావళి పండగ అంటే నాకు ఇష్టం.”