“వాచ్ మేన్ వచ్చి నన్ను తరుముతూ ఉంటాడు. అర్థ రాత్రిల్లో తాగుబోతులు నన్ను కొట్టి, నా దగ్గర ఉండే డబ్బులు లాగేసుకుంటారు. నన్ను దోమలు కుడుతూ ఉంటాయి. మొదట్లో నాకు చాలా సిగ్గుగా అనిపించేది. కానీ ఏం చేస్తాం, నాకు ఇది తప్ప వేరే బ్రతుకుదెరువు తెలీదు. పిల్లల్ని పెద్ద చేసి, పెళ్లిళ్లు చేసే సరికి నా వంట్లో ఓపిక అంతా పోయింది. ఇప్పుడు నాకంటూ చివరి దశలో ఉన్న భార్యని చూసుకునే బాధ్యత తప్ప ఇంకేమీ మిగలలేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు, కానీ నేను ఇంకేం చేయలేను.”