“నాకు ఎండా కాలం, ఐస్ క్రీమ్ అంటే ప్రాణం. ఏ వ్యాపారం తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. దీనికి ముందు 15 సంవత్సరాల పాటు పిస్కల్చర్ వ్యాపారం చేశాను.ఆ తరువాత భీమవరంలో ఒక బాలియర్ ఫ్యాక్టరీ లో పనిచేశాను. దాని వల్ల నాకు జీవితంలో అంత సంతృప్తి కలగలేదు. అందుకని, మూడు సంవత్సరాల క్రితం విజయవాడ వచ్చి చిరు తిళ్ళ వ్యాపారం ప్రారంభించాను. అప్పటి నుంచి ఇదే నా జీవితం అయిపోయింది. మంచి లాభాలు వస్తున్నాయి కాబట్టి, వేరే వ్యాపారం వైపు వెళ్తానని అనుకోవట్లేదు.
నేను ప్రతి రోజూ కష్టపడతాను. కష్టానికి తగ్గ ప్రతిఫలమూ ఉంటుంది. అమ్మకాలు జరిగే దాన్ని బట్టి, ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు మాకు ప్రోత్సాహకాలు ఇస్తారు.ఒకటి మాత్రం చెప్పగలను, నాకు వచ్చే దానితో నేను, నా కుటుంబం జీవిస్తున్నాం.
నా భార్య ఇంట్లో పనులు చూసుకుంటుంది. మా పిల్లలు కహెలీ సమయంలో నాకు సహాయం చేస్తారు.నెను ఇంకో 15-20 సంవత్సరాలు ఈ పని చేయగలనేమో. ఆ తరువాత, మా కుటుంబంలో నుంచి ఎవరూ ఈ పక్కకి రారు. మా పిల్లలకి వేరే ఆశలు ఉన్నాయి. వాళ్ళ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. వాళ్ళకి ఆ సత్తా, టాలెంట్ ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్తు గురించి నాకేమీ దిగులు లేదు.”