టీమ్ హెచ్ఓఏ: హలో. నువ్వు ఏం చేస్తుంటావ్?
కిడ్: హలో. నా పేరు అభివన్. నేను ఆమ్బిటస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నాను.
టీమ్ హెచ్ఓఏ: సరే! నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్? నీ యాస ఇండియన్ ఆక్సెంట్ లా లేదే.
కిడ్: హా అవును. నేను ఆస్ట్రేలియా లో ఉండేవాడిని. నేను ఆస్ట్రేలియన్ పౌరుడ్ని. మా తలిదండ్రులు, భారతీయులే, కానీ మేము
ఆస్ట్రేలియా వెళ్ళిపోయాము. అమ్మమ్మ తాతయ్యలతో ఉండాలనిపించింది, అందుకని మేము ఇక్కడికి వచ్చాము.
టీమ్ హెచ్ఓఏ: ఓహ్ అలాగా. ఎప్పటి నుంచి నువ్వు సైకిల్ తొక్కుతున్నావ్? సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి?
కిడ్: సైకిల్ తొక్కడం వల్ల, మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి లభిస్తుంది.నాకు 4 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి, నేను సైక్లింగ్ చేస్తున్నాను. నేను గత 7 సంవత్సరాల నుంచి సైక్లింగ్ చేస్తున్నాను. చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు సందర్శించడం నాకు ఇష్టం.నా దగ్గర ఎలక్ట్రిక్ సైకిల్ ఉంది, కాబట్టి నాకు ప్రయాణం చేయడం సులువు.
టీమ్ హెచ్ఓఏ: ఓకే. ఎంత కాలం నుంచి నువ్వు ఇండియా లో ఉంటున్నావు?
కిడ్: నేను ఇండియాకి వచ్చి సంవత్సరం పైనే అయ్యింది. నేను పోయిన ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉంటున్నాను.
టీమ్ హెచ్ఓఏ: నీకు బాగా నచ్చిన ఆట ఏది?
కిడ్: నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఆస్ట్రేలియా, ఇండియా నాకు నచ్చిన జట్లు.
టీమ్ హెచ్ఓఏ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో ఇండియా, ఆస్ట్రేలియా బాహాబాహీ తలపడ్డాయ్యి. నాలుగవ టెస్ట్ చాలా రసవత్తరంగా సాగింది. దీని మీద నీ అభి[ప్రాయం.
కిడ్: ఆట చాలా రసవత్తరంగా సాగిన మాట నిజమే. ఇండియా, ఆస్ట్రేలియా ఆడేటప్పుడు, నేను ఏ జట్టుకీ సపోర్ట్ చేయను. ఆటని ఆస్వాదిస్తాను అంతే.
టీమ్ హెచ్ఓఏ: క్రికెట్ కాకుండా ఏ ఆటలు ఆడతావ్?
కిడ్: నేను క్రికెట్ ఎక్కువగా ఆడతాను. క్రికెట్ కాకుండా, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, సాకర్, టెన్నిస్ ఆడతాను.
టీమ్ హెచ్ఓఏ: నువ్వు పెద్దయ్యాక, ఏం అవ్వాలనుకుంటున్నావ్?
కిడ్: పెద్దయ్యాక ఫిజీషియన్ అయ్యి, అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను. వసతులు సరిగా లేని ప్రదేశాల్లో, సేవ చేయాలనుకుంటున్నాను.
టీమ్ హెచ్ఓఏ: మంచి ఆలోచన. నీకు మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాలని ఉందా?
కిడ్: ఇంకా ఏం అనుకోలేదు. ఆస్ట్రేలియాలో ఉండే స్నేహితులని సంవత్సరానికి రెండు సార్లైనా కలవాలని ఉంది. జీమెయిల్, స్కైప్ లో స్మేహితులను కలుస్తాను. కానీ వాళ్ళని మిస్ అవుతున్న భావన. ఇండియాలో కూడా నాకు స్నేహితులు ఉన్నారు.భవిష్యత్తులో, స్నేహితులందరితో టచ్ లో ఉండాలని ఆశ!”