“పదవ తరగతి తరువాత, ఇంట్లో వాళ్ళు నాకు పెళ్ళి చేశారు. దీని వల్ల, పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అని నేను కన్న కలలన్నీ చెదిరిపోయాయి.
మా అబ్బాయి చదువుకి సహాయపడటానికి, అయిదు సంవత్సరాల క్రితం, నేను ఆటో నడపడం మొదలుపెట్టాను. ఈ విషయంలో, నా భర్తకి సహాయం చేయాలనుకున్నాను.వాడి కలలని నెరవేర్చుకునే అవకాశం కల్పించాలని, నేను, నా భర్త అనుకున్నాం. ఆటో నడపడం, నాకు అనుకోని వరంలా లభించింది. దీని వల్ల, నా కూతుర్ని కోల్పోయిన బాధను మర్చిపోగలిగాను. నా కూతురు, కిడ్నీ సమస్యతో చనిపోయింది.
కొడుకు చదువుకి సహాయం చేయడానికి మొదలు పెట్టిన ఉద్యోగం, నాకు స్వేచ్ఛనీ, బలాన్నీ చేకూర్చింది. నేను కలలు కన్నట్టు, ఆర్థికంగా స్వాతంత్య్రం సంపాదించాను.
ప్రతీ దాంట్లో, మంచీ చెడూ ఉంటాయి. ఈ వృత్తిలోకి వచ్చినందుకు, నన్ను మెచ్చుకునే కస్టమర్లు ఉన్నారు, ఇబ్బంది పెట్టే మగ ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. కొన్ని సార్లు, వాళ్ళ హద్దుల్ని దాటి కూడా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో, ఇబ్బందిగా ఉంటుంది. కొంత మంది కస్టమర్లైతే, మగ డ్రైవర్లనే ఎంచుకుంటారు. వాళ్ళ సెక్సిస్ట్ మనస్తత్వమే దీనికి కారణం.
ఒకసారి ఏం జరగిందంటే, ఒక మగ ఆటో డ్రైవర్, నన్ను దుర్భాషలాడి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వెంటనే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ వారు, నా కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకోలేదు.
పోలీసు వారు, ప్రభుత్వం మాత్రమే కాదు, కొంతమంది మగ కస్టమర్లు కూడా మమ్మల్ని లెక్క కట్టరు. మాలాంటి వారికి విజయం అంత సులువుగా రాదు. మా పయనంలో, కష్టాలు, వేధింపులు ఉంటాయి. నా హక్కులు కోసం పోరాడటానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. మగ వారి లాగానే, మమ్మల్ని కూడా ఈ ప్రపంచం సమంగా చూసే రోజు రావాలని నా కోరిక.”