“నేను పుట్టింది, పెరిగింది అంతా ప్రకాశం జిల్లా కందుకూరులో. నా చిన్నతనం నుంచి, ఆర్మీ గురించి, ఆర్మీలో సేవలందించడం గురించి, గొప్పగా ఎన్నో కథలు విన్నాను.జీవితంలో ఒక్కసారైనా ఆర్మీ లో చేరి దేశానికి సేవచేయాలని ఉండేది. ఈ ప్రక్రియలో, నా ప్రాణం పోయినా పర్లేదు అనిపించింది. అందుకని, ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు, ఆర్మీలో చేరడానికి నాకు సహాయ పడుతుందని నేషనల్ క్యాడెట్ కార్ప్స్ గురించి బాగా తెలుసుకున్నాను. ఇంటర్మీడియేట్ పూర్తయ్యాక, ఎన్సీసీ ఉండే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కోసం వెతకడం మొదలుపెట్టాను. అలా టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి విన్నాను. అక్కడ, నాకు కావాల్సిన కోర్స్ అందుబాటులో ఉంది. నేను, హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగులో డిగ్రీ చేశాను, డిగ్రీ చేసేటప్పుడే, ఎన్సీసీ లో బి, సి సర్టిఫికెట్ సంపాదించాను. ఆ సర్టిఫికెట్స్ వల్ల, నాకు సీనియర్ ఆఫీసర్ ర్యాంక్ మెడల్ లభించింది.
ఇంట్లో, నేను ఒక్కడినే సంతానం కాబట్టి, నేను ఆర్మీలో చేరతా అంటే, మా నాన్న ఒప్పుకోలేదు. కానీ, ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేసే మా అంకుల్, ఏది ఏమైనా, ఆర్మీ లో చేరడానికి మా కుటుంబాన్ని ఒప్పించే, ధైర్యం, బలం ఇచ్చారు.
నేను ఆర్మీలో చేరడానికి రెండు సార్లు ప్రయత్నించాను. రెండు సార్లు నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను. మొదటిసారి సరిగ్గా పరిగెత్తలేక సెలెక్షన్ ప్రక్రియలో విఫలమయ్యాను. రెండవసారి, ఫిజికల్ సెలక్షన్ లో పాస్ అయినా, మెడికల్ డిస్టర్బెన్స్ వల్ల ఉత్తీర్ణత సాధించలేకపోయాను. రెండు సార్లు విఫలం అయినా, ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత సాధించి, ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఆర్మీ లో చేరి, దేశానికి సేవ చేస్తాను.”