“మాది చెరుకుపల్లి. ప్రతి సంవత్సరం సంక్రాంతి అమ్మమ్మ తాతయ్యలతో జరుపుకోవడానికి, నేను కొల్లూరు వస్తాను. అమ్మానాన్న తో కలిసి, నేను, అన్నయ్య ఇక్కడికి పండక్కి వస్తాము.
నాకు పండక్కి ఇక్కడికి రావడమంటే చాలా ఇష్టం. అమ్మమ్మ మాకోసం రుచికరమైన పదార్థాలు చేసి పెడుతుంది. పండక్కి, అమ్మమ్మ మాకు కొత్త బట్టలు కొనిపెడుతుంది. ఆమె చేసే మురుకులంటే నాకు ప్రాణం. పండగ అయిపోయాక, తిరిగి ఇంటికి వెళ్ళటప్పుడు రకరకాల పదార్థాలు కట్టి పంపుతుంది. పండగ రోజున అమ్మమ్మతో పాటే ఉదయానే లేచి, ఇంటి బయట ముగ్గులు వేస్తాను. సాయంత్రం పూట, నేను అన్నయ్య, మిగతా కజిన్స్, పక్కన వాళ్లతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తాము. మేము ఇక్కడ 4 రోజులు ఉంటాము. ఆ నాలుగు రోజులు, సంవత్సరంలో నాకు బాగా ఇష్టమైన రోజులు. ఇక్కడ, ఓపిక అయిపోయేదాకా అడ్డుకుంటాం. నాకు అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో, సంక్రాంతి అంటే కూడా అంతే ఇష్టం.”