“నాకు చిన్నతనం నుంచే జంతువులంటే ప్రాణం. జంతువుల పట్ల ప్రేమని మాటల్లో వర్ణించలేము. జంతువులు మన జీవితాల్లో సంతోషాన్ని నింపుతాయి. నేను గత 30 సంవత్సరాల నుంచి జంతువులని సంరక్షిస్తున్నాను. నేను స్వర్ణకారుడ్ని. నాది సాఫీగా సాగిపోయే జీవితం. నాకొచ్చే సంపాదనలో నుంచి, నెలకి 10,000 చుట్టుపక్కన ఉండే కుక్కలని పోషించడానికి ఖర్చుపెడతాను. నాకు ఒక గోశాల కూడా ఉంది. జంతువులు, నా జీవితంలో ఒక భాగం అయ్యాయి.
ఇది నా పెట్. గత 11 సంవత్సరాలుగా ఇది నా దగ్గరే ఉంటుంది. ఇది మా కుటుంబంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు నా వయసు 57 సంవత్సరాలు. ఇప్పటి వరకూ నేను ఎన్నో కుక్కులను పెంచుకున్నాను. వాటన్నిటికీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం, నేను పెంచుకుంటున్న ఈ పెట్ 11 సంవత్సరాలుగా నాకు ప్రేమని పంచుతూనే ఉంది. జంతువులని చూసుకోవడం అంటే, పిల్లలని చేసుకోవడంతో సమానం. వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి. మా కుతాయంబం నిండా జంతు ప్రేమికులమే. వాళ్ళకి కూడా, జంతువుల పట్ల నాకున్నంత ప్రేమే ఉంది. మా పెట్ కి చికెన్, గుడ్లు అంటే ప్రాణం. వాడికి ప్రతిరోజూ అవే పెడతాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26న వాడి పుట్టినరోజుని ఘనంగా జరుపుతాము.
నేను బాధలో ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా వీడికి తెలిసిపోతుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా, వాడి చేష్టలతో నన్ను నవ్విస్తాడు. పెట్స్ మన బాధని తగ్గించగలవు. బేషరతు ప్రేమ, విధేయతతో అసలు మానవత్వం అంటే ఏంటో మనకి నేర్పిస్తాయి. నా పెట్స్ నా ప్రపంచం. నాకు ఓపిక ఉన్నంతవరకు, సాధ్యమైనన్ని జంతువులని చూసుకుంటాను.”