“నేను ఈ సంవత్సరం ఎంబీఏ లో చేరుతాను. అందుకే, ఈ సంవత్సరం నాకు ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం నేను సేల్స్ అసోసియేట్ గా పనిచేస్తున్నాను. నేను చెన్నై లో ఇంజనీరింగ్ చేశాను. దీంతో, నాకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అయ్యింది. నా విషయానికొస్తే, నేను జన్యుపరంగా కొద్దిగా పొట్టి. నాలో, ప్రజలు ఎక్కువగా గమనించేది అదే. నేను ఇలా ఉంటాను కాబట్టి, నీకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి అని అందరూ అనుకుంటారు. కానీ, నాకు ఎప్పుడూ అలా జరగలేదు. స్కూల్ లో ఉన్నపుడు, కొంత మంది నన్ను చూసి నవ్వేవాళ్ళు. కానీ, నా స్నేహితులు నాకుతోడుగా ఉండేవారు. నాది స్నేహపూర్వమైన మనస్తత్వం. నా ప్రవర్తన వల్ల, నేను ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోగలిగాను. నేనెప్పుడూ నా ఎత్తుని ఒక లోపం అనుకోలేదు, నా బలమనే అనుకున్నాను. ఒకవేళ నేను అందరిలాగానే ఉండుంటే, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను జనం మధ్యలో నిలబడగలను. నాకు అదే ముఖ్యం. నన్ను, నా జీవితాన్నీ సానుకూలంగా చూడటమంటే నాకు ఇష్టం. నా ఎత్తు అంటే నాకిష్టం అని సంతోషంగా చెప్పగలను.
నేను సంతోషంగా ఉన్నాను. నాకు అదే ముఖ్యం. నా జీవితంలో అతిపెద్ద మలుపంటే చెన్నై లో ఇంజనీరింగ్ చేయడమే. ఒకమాటలో చెప్పాలంటే, బావిలో కప్పలా ఉండే నేను, ఎంతో మారిపోయాను. నా కోర్సు లో భాగంగా కొత్త ప్రజలు, సంస్కృతుల గురించి తెలుసుకోగలిగాను. ఎంబీఏ లో చేరాక, నా నైపుణ్యాలు మెరుగవుతాయని ఆశిస్తున్నాను. దీంతో, నీ జీవితం మంచిగా మారుతుందేమో అని ఆశ!”