“నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే చాలా మక్కువ. అయినా, కూడా బొమ్మలు గీయడం 2014 లో నా మాస్టర్స్ పూర్తయిన తరువాతనే మొదలుపెట్టాను. అందరికీ, పేపర్ల మీద, గోడల మీద గీయడం ఇష్టం ఉంటే, నాకు వంటి మీద బొమ్మలు గీయడం అంటే ఇష్టం. నా దృష్టిలో, టాటూ వేయడం కూడా, ఒక కళే. కాకపోతే, ఆ కళ చర్మం మీద చూపిస్తాం అంతే. ఈ విషయంలో, నాకు, మా అమ్మానాన్న కి పెద్ద గొడవే జరిగింది. వాళ్ళకి, నేను మంచి ఉద్యోగం చేయాలని ఉండేది. కానీ, నాకు ఒకరి కింద పనిచేయాలని లేదు. ఏదైనా సొంతంగా ఉండాలని, టాటూ వేసే పని కి సంబంధించిన పని ఏదైనా చేయాలని ఆశ.
టాటూలకి సంబంధించిన కోర్సులు ఎమన్నా ఉన్నాయా అని బాగా వెతికాను. హైదరాబాద్ లో మూడేళ్లపాటు అప్రెంటీస్ గా పనిచేశాను.. అప్రెంటీస్ గా పనిచేసేటప్పుడు దాదాపు 8,000 టాటూలు వేశాను. ఇక్కడ విజయవాడలో ఇంకొక 2,000 టాటూలు వేశాను. పెద్ద నగరాలతో పోలిస్తే, టాటూ కల్చర్ ఇక్కడ అంతగా లేదు. కానీ, అది కూడా మెల్లిగా పుంజుకుంటుంది.
నేను ఈ మధ్యనే ఒక వాటర్ కలర్ టాటూ వేశాను. వాటర్ కలర్ టాటూ వేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తాను, ఎందుకంటే, ఆ టాటూ వేయడం పెద్ద సవాలే. నాకున్న హద్దుల్ని చెరిపేస్తూ, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే నాకు ఇష్టం.
టీమ్ హెచ్ఓఏ: మీ జీవితంలో సంతోషకరమైన క్షణం ఏదని చెప్తారు?
నగేష్: నన్నడిగితే, నేను రోజూ అని చెప్తా!”