“టెడ్డీ బేర్లు, బాతులు వంటివో సిరామిక్ బొమ్మలు మరియు ఇతర ఫ్యాన్సీ వస్తువులకి, నా స్టాల్ పెట్టింది పేరు. ఆడవారు,పిల్లలు మా స్టాల్ కి ఎక్కువ మంది వస్తారు. తల్లిదండ్రులతో వచ్చే పిల్లలు, మా స్టాల్ లో బొమ్మలు చూసి ఏడుపు ఆపేస్తారు.
వ్యాపారం కోసం, నేను శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో సిమెంట్ పని చేసేవాడ్ని. కొన్ని సంవత్సరాల తరువాత బొమ్మలు అమ్మడం మొదలుపెట్టాను. నా దగ్గర ఒక పుష్ కార్ట్ మాత్రమే ఉంది. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది, ఇప్పుడప్పట్లో ఆ పుష్ కార్ట్ ని మారుస్తానని అనుకోవట్లేదు. నేను ఎంతగానో శ్రమపడతాను, కానీ, కష్టే ఫలి అనే సూత్రాన్ని నేను బాగా నమ్ముతాను. నాకు వచ్చే రాబడితో, నా నాలుగు వేళ్ళు నోట్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాను.
నాకు కావాల్సిన బొమ్మలన్నిటినీ వన్ టౌన్ హోల్ సేల్ మార్కెట్ లో కొంటాను. ఆ హోల్ సేల్ మార్కెట్ కి నెలకి రెండు సార్లు వెళ్తాను. నేను బొమ్మలు సరసమైన ధరలకే అమ్ముతాను. నేను అమ్మే బొమ్మలు 50-200 రూపాయల మధ్య;లో ఉంటాయి. అయినా కూడా కొంత మంది బేరం చేస్తారు.
నా రోజు ఉదయం 7 గంటలకి మొదలవుతుంది. ఇంతకు ముందు, నా స్టాల్ రాత్రి వరకూ తెరిచేవాడ్ని. కోవిడ్-19 వల్ల, స్టాల్ తొందరగా మూసేస్తున్నాను.
ఖాళీ సమయంలో, నాకు కుటుంబంతో గడపడం అంటే ఇష్టం. నేను ఈ వృత్తిలోకి వచ్చి 25 సంవత్సరాల పైనే అయ్యింది. ఇన్ని సంవత్సరాలలో, నగరం బాగా అభివృద్ధి చెందడం చూశాను. నాలాగే, బొమ్మలు, బట్టలు, సోడాలు, పళ్ళు అమ్మే వర్తకులు చాలా మంది ఉన్నారు. నేను వాళ్లందరినీ గౌరవిస్తాను. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇతర వర్తకులు సహాయం చేస్తాము. అందరం ఐకమత్యంగా ఉంటాము!”