“నేను శ్రీ చైతన్య స్కూల్ లో చదువుతున్నాను. తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులు, ఇలా నాకు ప్రపంచంలోనే ఉత్తమమైన కుటుంబం దొరికిందని చెప్పొచ్చు. జీవితాన్ని ఆస్వాదించడానికి, ప్రతీ క్షణాన్ని ఒడిసి పట్టుకోవడానికి మాకు కొన్ని ప్రత్యేకమైన శైలి ఉంది. ప్రతి ఆదివారం, మేమంతా బయటికి వెళ్ళి సమయం గడిపి వస్తాము. అలా బయటికి వెళ్ళిన ఒక ఆదివారం నాడు, నాకు పెద్ద ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ వల్ల, నా ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయి, మెదడులో రక్తం గడ్డ కట్టింది. దురదృష్టవశాత్తూ, ఆ ప్రమాదం లాక్డౌన్ కి ముందే జరిగింది. దీంతో, మా వ్యాపారం దెబ్బతినడం, హాస్పిటల్ ఖర్చులు పెరగడం మొదలయ్యాయి. శారీరకంగా నేను కొంతవరకూ మెరుగయ్యాను. కానీ, మానసికంగా నేనింకా రికవర్ అవుతూనే ఉన్నాను. నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ విషయంలో నేనేమీ చేయలేకపోయాను.
ఆ ప్రమాదం వల్ల కలిగిన ట్రోమా ఎంత తీవ్రంగా ఉంటుందంటే, దాన్ని వల్ల ఒక్కోసారి మూర్ఛ కూడా వచ్చేది. నన్ను, నా కుటుంబాన్ని, ఆ ప్రమాదం ఎంతో భయానికి గురిచేసింది. మావి చాలా సాధారణమైన జీవితాలు. మా జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయని, నేను అనుకోలేదు. నేను కోలుకోవడమే, పెద్ద ఆశ్చర్యమని డాక్టర్లు చెప్పారు. సజీవంగా హాస్పిటల్ నుంచి బయట అడుగుపెట్టడమే నేను నమ్మలేకపోయాను.
జీవితం ఇంతకు ముందులా లేదు. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. నాకు నేను సర్ది చెప్పుకున్నా, వచ్చే ప్రతీ కష్టానికీ ఎదురెళ్తానని. ఇప్పుడు నాకున్న పెద్ద కల ఒకటే, తొందరగా కోలుకోవాలి. ఈ బెడ్ రెస్ట్ నుంచి బయట పడాలి. త్వరగా కోలుకొని, ఇంతకు ముందులా కుటుంబంతో కలిసి బయట తిరగాలి”