“నేను మొదటిసారి తల్లి కాబోతున్నాను. నా 35 సంవత్సరాల జీవితంలో ఇదే పారవశ్యానికి గురి చేసిన సందర్భం. నేను పోయిన సంవత్సరమే గర్భం దాల్చాల్సింది. తానొకటి తలిస్తే, దైవమొకటి తలిచిందని, గర్భం దాల్చడానికి అనుకున్నదానికన్నా ఎక్కువ సమయం పట్టింది. ఆలస్యమైనా గర్భం దాల్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు 8 నెలల కడుపుతో ఉన్నాను. నేను గర్భవతిని అని తెలిసిన రోజుని ఇప్పటికీ మర్చిపోలేను. నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే నా భర్తకి చెప్పా. తాను కూడా చాలా ఆనందపడ్డాడు. ఇది మా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన సందర్భం.
గర్భం దాల్చడం వల్ల సంతోషంగానే ఉంది. కానీ, ఇంత బాధ్యత నేను ఎలా మోస్తానో అనే భయం కూడా ఉంది. నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఒకసారి మాతృత్వాన్ని ఆస్వాదించడం మొదలుపెడితే, బాధ్యత అదే తెలుస్తుంది. కరోనా మహమ్మారి మూలాన, మును మరింత బాధ్యత తీసుకున్నాం. సురక్షితంగా ఉండటానికి, నా కోరికలను అణుచుకోవడానికి ప్రయత్నించాను. ఇంట్లోనే, రకరకాల వంటకాలు చేయడానికి ప్రయత్నించాను. ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో ఉన్న బిడ్డ హార్ట్ బీట్ వినడంలో పొందే అనుభూతి వర్ణనాతీతం. లోపల ఉన్న బాబు? పాప మంచి కిక్ బాక్సర్ అనుకుంటా.
చిన్న పిల్లలకి సంబంధించిన బట్టలు, బొమ్మలు, ఉయ్యాలా అన్నీ సెలెక్ట్ చేసి పెట్టాను. శిశువు జన్మించగానే, అవన్నీ కొంటాను. పుట్టిన పిల్లల కోసం రంగు రంగుల బూట్లు, టోపీలు కుట్టడం నేర్చుకున్నాను. లోపలున్న శిశువు ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా, ఈ దుస్తులు ఎప్పుడు తొడగాలా అని ఎదురుచూస్తున్నాను. ఈ బట్టలు వేసి, ఫోటో షూట్ చేయిస్తాను.
అమ్మ అవ్వడానికి చేసే ప్రయాణం చాలా అందమైనది. మన లోపల ఇంకో జీవి పెరుగుతుందని అనే భావనతోనే హృదయం బరువెక్కుతుంది. ఒక్కోసారి దాని గురించి ఆలోచిస్తేనే గూస్బంప్స్ వస్తుంది. శిశువుని ఎత్తుకోవడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నాను.”