“నా చిన్నతనం నుంచే, సొంతంగా ఏదైనా చిన్న తరహా వ్యాపారం ప్రారంభించాలని ఉండేది. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు పెళ్లైంది. మాది ప్రేమ వివాహం.
నేను, మా ఆయన హైదరాబాద్ లోని మా సొంతఊరులో చిన్న అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఆయన రోజుకూలీ పని చేసేవారు, నేను ఇంటి పని చూసుకునేదాన్ని.
మాకు రెండో పాప పుట్టిన తరువాత వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో మేము విజయవాడ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. పిల్లలకి మంచి చదువు చెప్పించడం మాకు అతి పెద్ద బాధ్యత.
నేను మా అత్తయ్య తో కలిసి, దుర్గమ్మ టెంపుల్ రోడ్ దగ్గర దేవుడి ఉంగరాలు, కంకణాలు అమ్మేదాన్ని. మా ఆయన రోజు కూలీ పనిని ఆపలేదు
నా రోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది, దాదాపు సాయంత్రం 7 గంటల వరకూ పని చేస్తాను. నేను రోజూ ఉదయాన్నే లేచి, వంట చేసి, పిల్లలని తయారు చేసి, కొట్టు దగ్గరికి వస్తాను.
పెళ్ళి వల్ల నేను తెలుసుకున్నదేంటంటే, పిల్లలు పుట్టిన తరువాత ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఒకరి బలం మీద ఇంకొకరు నమ్మకం ఉంచి, జీవితంలో ముందుకు కొనసాగాలి.
మా 7 ఏళ్ళ వైవాహిక జీవితంలో, ఇప్పటివరకూ మేము ఎన్నో ఎత్తు పల్లాలు చూశాము. మనకీ మంచి కాలం వస్తుందని, ఒకరికోకారం ధైర్యం చెప్పుకుంటాం.
ప్రతి రోజూ మేము కష్టపడ్డాం. ఆ కష్టానికి ప్రతిఫలమే, ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర మాకంటూ ఒక సొంత స్టాల్ ఉంది. ఈ స్టాల్ మాకు రెండో ఇల్లు లాంటిది.
లాక్డౌన్ కి ముందుఎం మేము రోజుకి 800-1000 రూపాయల వరకూ సంపాదించేవాళ్ళం. ఆ సంపాదన మా ఖర్చులకి సరిపోయేది. కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల, వ్యాపారం పూర్తగా దెబ్బతింది.
ఇక్కడకి రావడానికి, ఈ వ్యాపారం ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా, మేము కష్టపడటం మానను.సొంత వ్యాపారం ఏర్పరుచుకోవడానికి మాకు అవకాశం కల్పించిన విజయవాడ వాసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వ్యాపారం భవిష్యత్తులో కూడా కోనసాగాలని కోరుకుంటున్నాను!”