“హాయ్! నా పేరు లక్కీ. గతవారమే, నేను, నాన్న అలోచించి ఒక కుక్కపిల్ల తెచ్చుకున్నాము. పెంపుడు జంతువులను పెంచడం,కొంచం కష్టం ఒక బాధ్యత అని నాకు తెలుసు. కానీ, ఆ కుక్క పిల్లని ఎత్తుకున్నప్పుడు కలిగిన భావాన్ని మాటల్లో చెప్పలేను.
మా ఇంట్లో ఒక పెద్ద పోమేరియన్ కుక్క ఉంది. వాడి పేరు ‘హీరో’. ఆడుకోవడానికి వాడికి కూడా ఒక ఫ్రెండ్ కావాలని, ఈ ఫిడో ని అడాప్ట్ చేసుకున్నాము.గత వారమే ఈ కుక్కపిల్లని ఇంటికి తెచ్చాము.
ఫిడో ని ఇంట్లో చూడగానే, అమ్మ ఆశ్చర్యపోయింది. మొదట్లో, అమ్మ ఒప్పుకోలేదు. రెండు కుక్కలని పెంచడం భారమవుతుందని అమ్మ అనుకుంది. నిజానికి, అమ్మ హీరో కంటే ఫిడో కే ఎక్కువ దగ్గరైంది. ఇంట్లో పని ఎక్కువైపోయిందని, అసలు ఖాళీ దొరకట్లేదని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.
అందుకని, ఈ మధ్య పెట్స్ ని నేనే చూసుకుంటున్నా. అమ్మకి కొంచం పని తగ్గిద్దామని. మా స్కూల్ ,మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. అప్పటివరకూ, పెట్స్ ని నేనే చూసుకుంటా. ఫిడ, మా జీవితాల్లో సంతోషాన్ని నింపింది. అది అత్యుత్తమ ఫీలింగ్.”