“మన జీవితంలో ఎంత మంది టీచర్లని కలిసినా, కొంత మందిని జీవితాంతం మర్చిపోలేం
టీచర్ అనే పదం విన్నప్పుడల్లా, నాకు మా సైన్స్ టీచర్ పేరే జ్ఞాపకం వస్తుంది
మాది ఆంధ్రప్రదేశ్ లోని పోసుపల్లె అనే చిన్న గ్రామం. నేను ప్రొద్దుటూరు లోని మోడెర్న్ హై స్కూల్ లో చదువుకున్నాను.
ఆ స్కూల్ లో పనిచేసే టీచర్లందరూ వాళ్ళ వాళ్ళ పనిని సక్రమంగానే నిర్వర్తించినా కూడా, అరుణ గారు అసాధారణమైన రీతిలో చదువు చెప్పేవారు. ఆవిడ పుస్తకాల్లో ఉండే పాఠాలతో పాటుగా, జీవితంలో విలువలు కూడా నేర్పేవారు.
దాదాపు 30 పైచిలుకు సంవత్సరాల అనుభవంలో, ఆవిడ ఒక్కసారి కూడా ఎప్పుడూ క్లాస్ కి లేట్ గా వెళ్ళలేదు.
పాస్ అయ్యి పై తరగతులకి వెళ్ళ్లే విద్యార్థీ/ విద్యార్థునుల దగ్గర నుంచి సేకరించిన పుస్తకాల ద్వారా మా స్కూల్ లైబ్రెరీ లో ఒక బుక్ బ్యాంక్ ఏర్పాటు చేశాము. ఈ బుక్ బ్యాంకు ద్వారా పుస్తకాలు కొనుక్కోలేని అణగారిన విద్యార్థులకి ఆ పుస్తకాలు పంపిణీ చేస్తాము. ఈ బుక్ బ్యాంకు ఏర్పాటు చేయాలనే ఆలోచన మా సైన్స్ టీచర్ దే. అవసరం లో ఉన్నవారికి సహాయపడే గుణం అలవడుతుందని మాతోటి ఆలా చేయించేవారు సైన్స్ టీచర్.
ఆవిడ ఎప్పుడూ కూడా మాకు లాజికల్ అసైన్మెంట్స్ ఇచ్చేవారు. ఆ అసైన్మెంట్స్ సవాలు విసురుతూ, ఆసక్తికరంగా ఉండేవి. అసైన్మెంట్స్ పూర్తిచేస్తే, నచ్చిన జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టు అనిపించేది. ఒక విద్యార్ధి పరిపూర్ణంగా అభివృద్ధి చెందటానికి ఇవి దోహాతపడతాయి.
స్కూల్ లో ఎప్పుడైనా టీచర్స్ డే, స్పోర్ట్స్ డే లేదా స్కూల్ ఆన్యూవల్ డే లాంటి ప్రత్యేకమైన రోజుల్లో, విద్యార్థినీ విద్యార్థులు డెకరేషన్ పనుల్లో పాలు పంచుకునేవారు. ఇలాంటి సమయాల్లో, ఆవిడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, స్టూడెంట్స్ ని గైడ్ చేస్తూ, పోటీలు నిర్వహించేవారు. ఇలాంటి వాటి ద్వారా, పరోక్షంగా మాకు టీం వర్క్ ని అలవర్చారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారానే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను.
నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అరుణ గారు. మీరు నాకు చేసిన సహాయానికీ, సైన్స్ ని నాకిష్టమైన సబ్జెక్టు గా చేసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను!”