“ఉదయం పూట స్కూల్ లో నిర్వహించే అసెంబ్లీలను, గ్రౌండ్ లో స్నేహితులతో కలిసి ఆడుకోవడాన్ని నేను మిస్ అవుతున్నాను. నేను చేయగలిగింది ఏముంది చెప్పండి? కోవిడ్-19 మూలంగా మా స్కూల్ మూతపడటం చాలా బాధాకరమైన విషయం.
ఆడుకోవడానికి మా అపార్ట్మెంట్ లో ఎవరూ లేరు. అందరూ, ఎవరి పనులతో వారు బిజీ అయిపోయారు. రోజంతా ఇంట్లో ఉండటం కష్టం అయిపోతుంది. ఈ మద్యనే మా నాన్న నాకు కొత్త ట్యాబ్ కొనిపించారు. ఈ మధ్య ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. నాకు అది నచ్చింది. ఉదయం మధ్యాహ్నం, రోజుకి రెండు ఆన్లైన్ క్లాస్ సెషన్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నా స్కూల్ వాతావరణానికి ఏదీ సమానం కాదు.
ఈ వైరస్ తొందరగా పోయి, స్కూళ్ళు మళ్ళీ ప్రారంభిస్తారని ఎదురుచుస్తున్నాను. తొందరగా స్కూల్ కి వెళ్ళిస్నేహితులతో కలిసి ఆడుకోవాలని ఉంది. నేను బాగా చదువుకుని, ఒక రోజు పెద్ద ఇంజనీర్ ని అవుతాను.”