టీం హెచ్ఓఏ: హలో. ఇక్కడ ఏం చేస్తున్నావ్?
హషిత: మా తమ్ముడు, చెల్లెలు తో ఆడుకుంటున్నాను.
టీం హెచ్ఓఏ: బాగుంది. మీ అందరికీ బొమ్మలతో ఆడుకోవడం అంటే ఇష్టమా?
హషిత: అవును. మాకు కార్లు, ఫైర్ ఇంజన్లు, బస్సు, ట్రైన్ బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం. కానీ మా తమ్ముడికి ఇవన్నీ ఇష్టం ఉండవు.
టీం హెచ్ఓఏ: ఓహ్. అలాగా. మీ తమ్ముడికి బొమ్మలతో ఆడుకోవడం ఎందుకు ఇష్టం ఉండదు?
హషిత: ఎందుకంటే తమ్ముడికి విమానాలు అంటేనే ఇష్టం. ఎగురుతున్న విమానం శబ్దం వినిపిస్తే చాలు, దాని వెనక పరిగెడతాడు. తమ్ముడు ఎప్పుడూ ఆకాశంలో విమానాలు కనిపిస్తాయా అని చూస్తూ ఉంటాడు.
టీం హెచ్ఓఏ: ఓహ్. మరి మీ తమ్ముడి సంతోషం కోసం మీరు ఏం చేస్తారు?
హషిత: మేము తమ్ముడికి చాకోలెట్లు ఇస్తాం. అయినా కూడా వాడు ఏడుస్తాడు.
టీం హెచ్ఓఏ: ఓకే. మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు?
హషిత: నేను ఏమవుతానో తెలీదు కానీ, ఆకాశాన్ని, నక్షత్రాలనీ దగ్గరగా చూసేలా మా తమ్ముడ్ని, చెల్లల్ని విమానంలో విహారానికి తీసుకుని వెళ్ళాలి.
టీం హెచ్ఓఏ: నీ కల చాలా బాగుంది. మరి మీ అమ్మా నాన్న ని మీతోపాటు తీసుకునివెళ్ళవా?
హషిత: తీసుకునివెళ్తాను. వాళ్ళు మా విమానంలో కాకుండా వేరే విమానం లో రావాలి.
టీం హెచ్ఓఏ: అవునా, ఎందుకలా?
హషిత: ఎందుకంటే, హోమ్ వర్క్ గురించి ఆలోచించకుండా మేము మా సెలవులని ఆనందించాలి. అమ్మా నాన్న మాతో వస్తే హోమ్ వర్క్ చేయమంటారు. సెలవులంటే ఆనందించాలి కదా?