“ప్రతి సంవత్సరం వేసవి సెలవులకి అమ్మ నన్ను తాతయ్య వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళేది. వేసవి సెలవులు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తాతయ్య నన్ను ముద్దు చేస్తారు, చాకోలెట్స్ కొనిపిస్తారు, నాకు పాకెట్ మనీ కూడా ఇస్తారు. నన్ను మామిడి తోటలకి తీసుకుని వెళ్ళేవారు.నన్ను అక్కడున్న మామిడిపళ్ళు అన్నీ తినేవాడ్ని. నాకు అప్పుడు చాలా సరదాగా అనిపించేది, తాతయ్యతో అలా గడపడం.నాకు తాతయ్యతో ఉండడం అంటే చాలా ఇష్టం.
ఈ సంవత్సరం కూడా అలా చేయాలని ఉంది కానీ, ఈ లాక్డౌన్ వల్ల తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళలేకపోయా. తాతయ్య బాధపడతారని నాకు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తాతయ్య బాగా గుర్తొస్తున్నారు. మళ్ళీ తాతయ్య ని కలవాలంటే ఇంకో సంవత్సరం దాకా ఆగాల్సిందే.”