“మాది దిగువ మధ్య తరగతి కుటుంబం.అందుకనే గ్రాడ్యువేషన్ పూర్తయిన వెంటనే, క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చిన మొదటి అవకాశాన్ని వదులుకోలేదు.మొదట్లో పని బాగానే ఉండేది కానీ, మెల్లిగా పని ఒత్తిడి పెరగడం మొదలుపెట్టింది. ఒత్తిడి ఎంతవరకూ పెరిగిందంటే వారాంతాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసేవాడ్ని.ఒకానొక సమయంలో పని లో డెడ్ లైన్స్ తప్ప ఇంకేమీ గుర్తొచ్చేవి కాదు.వీటన్నిటితోటి బాగా అలిసిపోయాను. నా నైపుణ్యాలు పెంచుకోవడానికి ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నించాను.నా కష్టాలు అన్నీ చూసిన నా మిత్రుడు చెప్పాడు, ఒకరి కింద పనిచేయడం నీకిష్టం లేకపోతే, నువ్వే సొంతంగా ఏదో ఒకటి ఎందుకు చేయకూడదు? అని.కొంత కాలం దీని గురించి ఆలోచించాను కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాలేదు.కానీ ఒక రోజూ ధైర్యం చేసి ఉద్యోగం మానేయడానికి నిర్ణయం తీసుకున్నా, కొన్ని వారాల తరవాత ఉద్యోగం మానేశా. నా స్నేహితుడితో కలిసి వ్యాపారం చేయడానికి నిర్ణయించుకున్నా ఏం వ్యాపారం చేయాలో అర్థం కాలేదు.ఈ విషయం మీదే రోజూ ఇద్దరం కలుసుకునేవాళ్ళం.నాలుగు నెలలు బుర్రలు బద్దలకొట్టుకున్న తరువాత థీమ్-బేస్డ్ ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాలనే నిర్ణయానికొచ్చాము. మా పార్లర్ లో వినియోగదారులకి ఇష్టమైన విధంగా వేరువేరు ఆకారాల్లో 3డి-ఐస్ క్రీమ్లు ప్రింట్ చేస్తాం.మాకు ఈ నిర్ణయం నచ్చి మంచిగా ఉంటుంది అనుకున్నాం కానీ, సరైన పెట్టుబడి లేక మొదట్లో బాగా ఇబ్బంది పడ్డాం. బ్యాక్-ఎండ్ మీద బాగా శ్రద్ధ పెట్టి అతి కష్టం మీద ఒక ఇన్వెస్టర్ మా పార్ట్నర్ గా ఉండటానికి ఒప్పుకున్నారు.మొదట్లో మా ఐస్ క్రీమ్ పార్లర్ ని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభించాలని అనుకున్నాం. కోవిడ్-19 మహమ్మారి, దేశవ్యాప్త లాక్డౌన్ మూలాన దానిని వాయిదా వేయాల్సి వచ్చింది.మా ప్రయత్నానికి ఇది మొదట్లోనే పెద్ద దెబ్బ అయినా కూడా పరిస్థితులు అన్నీ అనుకూలించాక మా ఆలోచనని వినియోగదారుల దగ్గరికి తీసుకుని వెళతాం అనే నమ్మకం ఉంది.”