“ఈరోజు ఉదయం లేవగానే, ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య మూడుకి చేరిందని వార్త తెలిసింది. అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కోవిడ్-19 గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, మనం వాటిని అంతగా పట్టించుకోవట్లేదని అనిపిస్తుంది. ఎంతవరకో ఎందుకు, నేను పనిచేసే చోటే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎవరూ చేతులు అడ్డు పెట్టుకోరు. ప్రజలకి ప్రభుత్వం ఎన్ని సూచనలు ఇచ్చినా రోడ్డు మీద ఎవరూ ఆ సూచనలను ఎవరూ ఆచరించట్లేదు. దానికి క్వారెంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్ అని పేరు పెట్టినా పాటించడం ఎంత కష్టమైనా కూడా, మన శ్రేయస్సు కోసం ఇతరులతో కొంత దూరంగా ఉండడం మంచిదే.
ఎక్కడో చైనా లోని ఒక ఊరిలో పుట్టిన ఒక వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే నాకు వోక్స్ విషయం అర్థం అయ్యింది, అలాంటి వైరస్ వస్తే తట్టుకోవడానికి మనకి ప్రాథమిక క్రమశిక్షణ కూడా లేదు. ప్రభుత్వం స్కూళ్ళు, మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు వంటివి మూసేయమని చెప్పినా కూడా మనం బయట తిరగకుండా ఉండలేము. ఆహారం, ఆరోగ్యం, రవాణా వంటి వాటిలో కోసం మనం బయటికి వెళ్లాల్సిందే. కాబట్టి మనం మనం సురక్షితంగా ఉంటూ, ఇతరులను కూడా సురక్షితంగా ఉంచడం మన బాధ్యత. ఆగోగ్య శాఖ ఇచ్చే మార్గదర్శకాల గురించి తెలియని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి, రోజువారీ కూలీలకు తెలిసేలా చెప్పడం కూడా మన బాధ్యతే. అందరం కలిసికట్టుగా ఈ వైరస్ తో పోరాడవలసిన అవసరం వచ్చింది.”