“నేను బి.ఏ పూర్తిచేశాను కానీ ఒక స్థిరమైన ఆదాయం మాత్రం పొందలేకపోయాను. సంవత్సరాల తరబడి నేను ఉద్యోగాలు మారుతూ వచ్చాను. ఏదైనా కొత్త ఉద్యోగానికి వెళ్తే అక్కడ వాతావరణం నచ్చక కొన్ని రోజులకే మానేసే వాడ్ని. నాకు 25 సంవత్సరాలు వచ్చేదాకా నేను జీవితంలో దేన్నీ సీరియస్ గా తీసుకునేవాడ్ని కాదు.
ఇంట్లో వాళ్ళకి నా పద్దతి అలవాటైపోయింది. వాళ్ళు నన్ను పనికి పంపించేవాళ్ళు కానీ నేను ఎలాగోలా వెనక్కి వచ్చేవాడిని. నా మొదటి కూతురు పుట్టినప్పుడు, తనకి పుట్టుకతోనే తీవ్ర అనారోగ్యం ఉండేది. తన చికిత్స కోసం దాదాపు 5 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు మా తల్లిదండ్రులను అడగడం తప్ప నేను ఇంక ఏం చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎంత భయానికి లోనయ్యానో చెప్పలేను. అప్పటి వరకు జీవితాన్ని చాలా తేలికగా తీసుకున్న, ఆ సంఘటన నాలో చాలా మార్పు తెచ్చింది. ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అయ్యింది, ఎందుకంటే నన్ను ఎవరూ నమ్మలేదు.నా భార్య మాత్రం నన్ను చాలా నమ్మింది. జీవితంలో అంత తేలికగా ఓటమిని అంగీకరించొద్దని చెప్పింది. దాంతో నేను ఆటో డ్రైవర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి ప్రతిరోజూ నేను కష్టంగా పనిచేసేవాడిని. అలా, నా కూతురిని చదివించడం, నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం, అలాగే నా భార్యని సంతోషపెట్టడం నా జీవితపరమావధి అని తెలుసుకున్నా. జీవితంలో లభించేవాటిని అభినందించడం నేర్చుకున్నాను, ఈ అలవాటు అలవడినందుకు సంతోషంగా ఉన్నాను. చివరికి, మా తల్లిదండ్రులు అనుకున్నట్టు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారాను.”