“నా పిల్లలు కూడా పనికి వెళ్తారు కానీ, వచ్చే ఆదాయం సరిపోదు. దాంతో మా కుటుంబం, ఎక్కువ డబ్బు ఆర్జించించడానికి వేరు వేరు వృత్తుల్లోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. నేను గత 30 సంవత్సరాలుగా ఈ పంచర్లు వేసే వృత్తిలో ఉన్నాను. నా షాప్ కి ఎదురుగుండానే ఒక పెద్ద బొమ్మలు అమ్మే దుకాణం ఉంది. అక్కడికి వచ్చే వాళ్ళు, వాళ్ళ పిల్లల కోసం ఖరీదైన బహుమతులు కొనడం నేను గమనిస్తాను. నాకు అంత స్తొమత లేదని తెలుసు, కానీ ఒకరోజు నా మనవడికి ఒక మంచి కారు బొమ్మ కానుకగా ఇస్తాను. బొమ్మల దుకాణానికి వచ్చే పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో, నా మనవడు కూడా అంతే సంతోషంగా ఉండాలి.”